అమరావతి: రానున్న ఐదేళ్ల లక్ష్యాలు, ప్రాధాన్యతలు: సీఎం చంద్రబాబునాయుడు
సెప్టెంబర్ 20 నాటికి ప్రభుత్వం 100 రోజులు పూర్తి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిలో జరిగిన జిల్లాల కలెక్టర్ల సమావేశంలో ప్రసంగిస్తూ, రానున్న ఐదేళ్లలో తాము నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారులపై బాధ్యత ఉందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి సెప్టెంబర్ 20 నాటికి 100 రోజులు పూర్తి అవుతుందని తెలిపారు.
సూపర్ సిక్స్ హామీలు, కట్టుబాటు:
సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చామని, వాటికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ మా విధానమని చెప్పారు. పరదాలు కట్టడం, చెట్లు నరకడం ఉండకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు.
పరిపాలన విధానంపై కీలక సూచనలు:
జిల్లాల కలెక్టర్ల సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తాను అందర్నీ కంట్రోల్ చేస్తున్నానని, పరిపాలన అనేది సర్వీసు మూడ్‌లో ఉండాలని చెప్పారు. అధికారాన్ని చెలాయించే పద్దతిలో ఉండడం సరికాదని అన్నారు. ఇన్నాళ్ల మారిదిగా రాజకీయాలు లేవని, ఇప్పుడు మారాయని గుర్తు చేశారు.
1995 నాటి చంద్రబాబు, ఆకస్మిక తనిఖీలు:
“1995 నాటి చంద్రబాబును చూస్తారని అంటున్నానని, మీరు ఇంకా ఆ స్పీడ్ రాలేదని” అంటూ చంద్రబాబు చురకలు అంటించారు. త్వరలో ఆకస్మిక తనిఖీలకు తాను వస్తానని చెప్పకనే చెప్పారు.
విజన్ 2047 టార్గెట్:
విజన్ 2020ని చాలామంది ఎగతాళి చేశారని, ఇప్పుడు విజన్ 2047 టార్గెట్ అని గుర్తుచేశారు. “ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. విష ప్రచారం చేస్తున్నవారికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉందని” అన్నారు.
పేదల సేవలో కొత్త కార్యక్రమాలు:
“ప్రతి నెలా ఒకటిన ‘పేదల సేవలో’ పేరుతో కొత్త కార్యక్రమం చేస్తున్నాం. మనందరం ప్రజల కష్టాలు తెలుసుకుని, పేదరికం లేని సమాజం కోసం పని చేయాలి” అన్నారు.
బలమైన నిర్ణయాలు, మంచి భవిష్యత్తు:
“మనమంతా కష్టపడితే 2047 నాటికి ప్రపంచంలోనే మనం నంబర్ వన్‌గా ఉంటాం. ఈ కలెక్టర్ల సదస్సు చరిత్ర తిరగరాయబోతోంది” అన్నారు. “మనం తీసుకునే నిర్ణయాల వల్ల వ్యవస్థలే మారే పరిస్థితి ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుంది” అన్నారు.
సభలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.