అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తన క్యాంపు ఆఫీస్ లో విద్యాశాఖపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి పథకం మరియు విద్యాకానుకపై విద్యా శాఖ అధికారులతో సీఎం విస్త్రృతంగా చర్చలు జరిపారు.
ఈ సమీక్షలో ఏపీలో అన్ని పాఠశాలలకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్ తీసుకొచ్చేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆడేశించారు. రాష్ట్రంలో 2024 నాటికి స్కూళ్ళలో పిల్లలు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలఅని ఆయన కోరారు.
అలాగే రాష్ట్రంలో ఉన్నత పాఠశాలల్లో ప్లే గ్రౌండ్ లేని చోట భూ సేకరణ చేసి ప్లే గ్రౌండ్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేలా చూడాలని సీఎం అధికారులకు తెలిపారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. కాలక్రమేణా ప్రి హైస్కూల్ స్థాయి వరకూ ప్లే గ్రౌండ్‌ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఇవాళ జరిగిన ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.