కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) కొత్త ప్రధాన కమిషనర్ నియామకంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న ఈ కమిటీ సోమవారం రాత్రి భేటీ అయింది. అయితే, సీఈసీ ఎంపికపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కమిషనర్‌గా ఉన్న జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించాలని మోదీ ప్రతిపాదించగా, అమిత్ షా అంగీకరించారు. కానీ, రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
సీఈసీ నియామక వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున, ఈ సమయంలో ఎంపిక తగదని అన్నారు. కానీ, మిగిలిన సభ్యులు నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లారు.
రాహుల్ అసంతృప్తితో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారని సమాచారం. అయినప్పటికీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకాన్ని ఆమోదించడంతో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఈసీగా జ్ఞానేశ్ కుమార్‌ను ఎంపిక చేయగా, కమిషనర్‌గా వివేక్ జోషిని నియమించారు.
సుప్రీంకోర్టు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడంతో కేంద్రం నియామక ప్రక్రియను కొనసాగించింది. అయితే, ప్రతిపక్షం అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకోవడం వలన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.