హైదరాబాద్: ముస్లిం లు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగలు చాలా తక్కువ. అందులో ప్రధానమైనవి, ఒకటి రంజాన్ మరొకటి బక్రీద్. ఈ రెండు పండుగలు వారికి చాలా ముఖ్యమైనవి.
సాధారణంగా పండుగలు క్యాలెండర్ లో తేదీల ప్రకారం జరుపుకుంటారు. హిందువుల పండుగల కు ఆధారం క్యాలెండర్ లు అలాగే వాటిలో ఉండే తిధులు. వాటిని బట్టే హిందువులు పండుగలు జరుపుకుంటారు.
అయితే ముస్లిం ల పండుగలు కూడా క్యాలెండర్ ప్రకారం చూసుకున్నప్పటికీ వారి పండుగలు ఎక్కువ శాతం చంద్రుడి పై ఆధార పడి ఉంటాయి. వారి పండుగలకు చంద్రుడి కి సంబంధం ఎక్కువ. వారికి చంద్రుడు ఆకాశం లో కనపడే రోజును బట్టి పండుగలు నిర్ణయించబడతాయి. ఇది అనాధిగా వారి ఆచారం.
అలాంటిదే ఇప్పుడు జరుగుతోంది. ముస్లిం లు ఈ మాసం లో జరుపుకునే పెద్ద పండుగ బక్రీద్. క్యాలెండర్ ప్రకారం ఈ పండుగ జూలై 31న్ ఉంది, అయితే చంద్రుడు సోమవారం కనిపించక పోవడంతో పండుగ ను ఆగష్టు 1న జరుపుకోవాలని మత పెద్దలు తెలియజేశారు.
రుహియతే హిలాల్ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ఖుబ్బుల్ పాషా ఈ విషయాన్ని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా నెలవంక కనిపించలేదని తమకు సమాచారం వచ్చిందన్నారు. ఇస్లామీ కేలండర్ ప్రకారం గురువారం నుంచి జిల్‌హజ్ నెల ప్రారంభమవుతోందని, ఇదే నెల పదో రోజున ముస్లింలు బక్రీద్ జరుపుకుంటారన్నారు.