fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsవకీల్ సాబ్ సెలెబ్రిటీ రెస్పాన్స్

వకీల్ సాబ్ సెలెబ్రిటీ రెస్పాన్స్

CelebrityResponse For PawanKalyanVakeelSaab

టాలీవుడ్: పవన్ కళ్యాణ్ నటించిన కం బ్యాక్ సినిమా ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9 న విడుదలైంది. మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాలు ప్లాప్ టాక్ తెచుకుంటేనే కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తాయి. అలాంటిది సూపర్ హిట్ టాక్ ఉండడం తో మరియు పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉండడంతో పవన్ ఫాన్స్ మరియు సినీ అభిమానులు ఈ సినిమాకి బ్రహ్మ రథం పడుతున్నారు. కేవలం రెగ్యులర్ ఫాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీ లో ఉన్న కో స్టార్స్ మరియు సీనియర్ టాప్ రేంజ్ హీరోలు కూడా ఈ సినిమాని , పవన్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటున్నారు.

ఈరోజు ఈ సినిమా చూసిన మహేష్ బాబు ‘వాట్ ఎ కం బ్యాక్’ అని ‘పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మన్స్’ అని వకీల్సాబ్ సినిమాని పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకున్నారు. అంతే కాకుండా సినిమాలో నటించిన అంజలి, నివేత, అనన్య పెర్ఫార్మన్సెస్ బాగున్నాయని, థమన్ మ్యూజిక్ అదరగొట్టాడని ట్వీట్ చేసి ఈ సినిమాని పొగిడాడు.

మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఫామిలీ మొత్తం తో ఈ సినిమా చూసి ‘మూడు సంవత్సరాల తర్వాత తీసినా కూడా అదే వేడి, అదే వాడి, అదే పవర్’ అని ,’కోర్ట్ డ్రామా అద్భుతం ‘ అని పవన్ కళ్యాణ్ ని వకీల్ సాబ్ ని మెచ్చుకున్నాడు. మరో బ్రదర్ నాగబాబు పవన్ నిజ జీవిత సంఘటనలకు చాలా దగ్గరగా ఉండడం తో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పెర్ఫార్మన్స్ బాగా వచ్చింది అని చెప్పారు. వీళ్ళే కాకుండా ఇండస్ట్రీ లోని చాలా ప్రముఖులు ఈ సినిమాని మరియు పవన్ కళ్యాణ్ ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఒరిజినల్ వెర్షన్ పింక్ కి ఏ మాత్రం తీసిపోకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్ లోనే ఉంది అని పొగిడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular