న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని నియంత్రించడానికి కేంద్రం క్రితంలో జారీ చేసిన మార్గదర్శకాలను ఇప్పుడు మళ్ళీ వాటినే పొడిగించింది. ప్రస్తుతానికి గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా ఇంకొన్నాళ్ల పాటు ఈ మార్గదర్శకాలను పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కోరింది.
కరోనా నియంత్రణకు కేంద్ర మార్గదర్శకాలను మరికొన్నాళ్లు పొడిగిస్తూ బుధవారం తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను ఆగస్టు 31వ తేదీ వరకు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు పంపింది. రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఆత్మ సంతృప్తి చెందవద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది.
కాగా దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ కన్నా అధికంగా ఉండడంపై కూడా కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో రానున్న వరుస పండుగల నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా తిరిగే రద్దీ ప్రాంతాల్లో తప్పకుండా కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
రాష్ట్రాలు తమ స్థానికంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకొనే వెసులుబాటును కల్పించింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పంచ వ్యూహం సిద్ధం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా కరోనాగా పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలను పంపారు.