న్యూఢిల్లీ: ఈ సంవత్సరం మార్చిలో మొదలైన కరోనా వైరస్ ప్రబలడం మొదలై 1 కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి వల్ల ఈ సంవత్సరం దేశంలో పెద్ద పెద్ద పండుగలన్నీ నామమాత్రానికే అన్నట్టు జరిగాయి.
ఇదిలా ఉండగా, దేశంలో యూకే స్ట్రెయిన్ కేసులు పెరుగుతుండటంతో తాజాగా కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. బుధవారం రాసిన ఈ లేఖలో కేంద్రం కొత్త స్ట్రెయిన్ కేసులు పెరగకుండా రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇందుకోసం కేంద్రం రేపు, ఎల్లుండి జరిగే కొత్త సంవత్సర వేడుకలపై తగు ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచించింది.
అయితే బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం విధించిన ఆంక్షలు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీ వరకు ప్రత్యేక విమానాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గోలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.