ఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షత వహించిన ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా పలువురు నేతలు హాజరయ్యారు.
కాంగ్రెస్ తరఫున జైరామ్ రమేశ్, గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. ఎన్డీయే, ఇండియా కూటమిలోని పార్టీల ఎంపీలు కూడా ఈ సమావేశంలో హాజరై కీలక అంశాలపై చర్చించారు.
రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానుండటంతో, పార్లమెంటులో చర్చలు సజావుగా సాగేలా ఈ భేటీలో ఏర్పాట్లు చేయడంపై చర్చించారు. కేంద్ర బడ్జెట్ తొలి విడత సమావేశాలు ఫిబ్రవరి 13 వరకు కొనసాగనున్నాయి.
రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈసారి బడ్జెట్ కీలకంగా మారనున్న నేపథ్యంలో, ప్రతిపక్ష పార్టీలు ప్రజాసంబంధ అంశాలను ప్రస్తావించనున్నట్లు సమాచారం. పెరుగుతున్న ధరలు, ఉపాధి అవకాశాలు, వ్యవసాయ రంగానికి మద్దతు వంటి అంశాలపై చర్చ జరగనుంది.