స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌తో జరిగిన పోరులో పీబీకేఎస్ కేవలం 111 పరుగులు మాత్రమే చేసింది. అయితే, ఈ చిన్న టార్గెట్‌ను చాహల్ ధాటైన బౌలింగ్‌తో కాపాడటమే కాదు, ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచింది.
కేకేఆర్ 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగగా, చాహల్ నాలుగు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. కెప్టెన్ రహానె, రింకు సింగ్, రఘువంశీ, రమణ్‌దీప్‌లను పెవిలియన్ చేర్చి కేకేఆర్‌ను ఒత్తిడిలో నెట్టాడు. నాలుగు ఓవర్లలో కేవలం 28 పరుగులు ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఈ విజయంతో చాహల్ ఐపీఎల్‌లో సునీల్ నరైన్ సరసన ఎనిమిదిసార్లు నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే కేకేఆర్‌పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువనేశ్వర్ కుమార్ (32) రికార్డును అధిగమించి 33 వికెట్లు సాధించాడు.
మొత్తంగా 166 మ్యాచ్‌ల్లో 211 వికెట్లు తీసిన చాహల్, ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్ల మార్కును దాటిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. అతడి అత్యుత్తమ గణాంకాలు 5/40 కాగా, సగటు 22.73, ఎకానమీ 7.91గా ఉంది. ఈ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలు బలపడగా, చాహల్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచింది.