స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్ చేరింది. భద్రతా కారణాల వల్ల భారత్ పాకిస్థాన్‌లో మ్యాచ్‌లు ఆడకుండా, దుబాయ్‌లోనే అన్ని మ్యాచ్‌లు ఆడుతోంది.
ఈ నేపధ్యంలో, ఒకే వేదికలో ఆడటం టీమిండియాకు లాభం కలిగిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ, “దుబాయ్ పిచ్ పరిస్థితులకు అనుగుణంగా టీమిండియా బలమైన స్పిన్ దళంతో బరిలోకి దిగుతోంది. ఇదే ఇతర జట్లకు లేదు” అని వ్యాఖ్యానించారు.
మైకేల్ అథర్టన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, “తరచు ప్రయాణం లేకుండా ఒకే వేదికపై ఆడటం, పిచ్‌ను అర్థం చేసుకోవడానికి టీమిండియాకు కలిసొచ్చే అంశం” అని అన్నారు.
ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్ కూడా ఈ వాదనకు మద్దతు ఇస్తూ, “భారత జట్టు ఇప్పటికే బలంగా ఉంది. ఒకే వేదికలో ఆడటం మరింత సానుకూలత ఇస్తోంది” అని తెలిపారు.