స్పోర్ట్స్ డెస్క్: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్ కు ఆరంభ మ్యాచ్‌లో చేదు అనుభవం ఎదురైంది. కరాచీ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్ 60 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
కివీస్ నిర్దేశించిన 321 పరుగుల లక్ష్యం ముందుంచుకొని బరిలోకి దిగిన పాక్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
పాక్ ఇన్నింగ్స్‌లో కుష్దిల్ షా 69, బాబర్ అజామ్ 63, సల్మాన్ ఆఘా 42 పరుగులతో పోరాడినప్పటికీ, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
న్యూజిలాండ్ బౌలర్లలో విలియం ఓ’రూర్కీ, మిచెల్ శాంట్నర్ తలో 3 వికెట్లు తీయగా, మాట్ హెన్రీ 2, బ్రేస్వెల్ 1 వికెట్ తీసి పాక్ బ్యాటింగ్‌ను కూల్చేశారు.
అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 320 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ యంగ్ (107), టామ్ లాథమ్ (118 నాటౌట్) సెంచరీలతో మెరిసారు. గ్లెన్ ఫిలిప్స్ 61 పరుగులతో వేగంగా ఆడాడు.
ఈ ఓటమితో పాక్ ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇక రేపు దుబాయ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ జరగనుంది.