ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం పాకిస్థాన్ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 29 ఏళ్ల తర్వాత పాక్ ఐసీసీ ఈవెంట్ నిర్వహిస్తుండటంతో స్టేడియాలను ఆధునీకరించి, భద్రతను కట్టుదిట్టం చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి స్టేడియంలను ఆధునీకరించి, ప్రేక్షకుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.
ఈసారి టోర్నీ హైబ్రిడ్ మోడ్‌లో జరుగుతోంది. పాక్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరుగుతుండగా, దుబాయ్‌లోనూ కొన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ జట్టు లీగ్ మ్యాచ్‌లన్నింటినీ దుబాయ్‌లో ఆడనుంది. టోర్నీ ఫిబ్రవరి 20న ప్రారంభమై, మార్చి 9న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.
భద్రత కోసం పాక్ ప్రభుత్వం 10,000 మంది పోలీసులను రంగంలోకి దించింది. స్టేడియంల చుట్టూ 24 గంటలు కంట్రోల్ రూమ్, సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఎస్కార్ట్ టీమ్స్ ఏర్పాటు చేశారు.
పీసీబీ టోర్నీ విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆటగాళ్లకు కేటాయించిన హోటళ్లలో సెక్యూరిటీ పెంచారు. స్టేడియం లోపల, బయట పక్కా తనిఖీలు నిర్వహిస్తున్నారు.