స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బంగ్లాదేశ్, పాకిస్థాన్‌పై గెలిచిన భారత జట్టు మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరంగా ఉండే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రోహిత్ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డారు.
బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించగా, రోహిత్ నెట్స్‌లో బ్యాటింగ్ చేయకుండానే స్ట్రెంచింగ్, జాగింగ్‌కు పరిమితమయ్యాడు. ఇది చూస్తుంటే, అతడికి విశ్రాంతి ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
రోహిత్ లేకపోతే, కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా వచ్చే అవకాశం ఉంది. అలాగే రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావొచ్చు.
మార్చి 4న జరిగే సెమీఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని, రోహిత్‌ని పూర్తిగా కోలుకునే వరకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.