స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఆతిథ్య జట్టుగా బరిలోకి దిగిన పాక్, ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడంతో సెమీస్ రేసులో వెనుకబడింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయినప్పటికీ, ఈ పరాజయాలు పాక్ అభిమానులను నిరాశకు గురి చేశాయి.
ఇప్పటి పరిస్థితిలో, పాక్ సెమీస్‌కు చేరాలంటే కొన్ని కీలక సమీకరణాలు కలిసి రావాలి. ఇవాళ న్యూజిలాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో బంగ్లా గెలవాలి. ఆ తర్వాత ఫిబ్రవరి 27న బంగ్లాతో జరగనున్న మ్యాచ్‌లో పాక్ తప్పకుండా గెలవాలి.
అంతేకాక, మార్చి 2న న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధిస్తే, గ్రూప్-ఏలో భారత్ 6 పాయింట్లతో టాప్‌లో నిలుస్తుంది. మిగతా మూడు జట్లు చెరో 2 పాయింట్లతో సమానంగా ఉంటాయి.
అప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా ఒక జట్టు సెమీస్‌కు వెళ్తుంది. పాక్‌కు ఆ అవకాశం దక్కాలంటే బంగ్లా, భారత్ గెలవడం తప్పనిసరి. కానీ ఇది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువే.