స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించగా, గ్రూప్-బీ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ దక్కించుకుంది. ఇక చివరి సెమీస్ సీటు కోసం ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిస్తే ప్రత్యక్షంగా సెమీస్‌కు చేరుతుంది. కానీ భారీ తేడాతో ఓడితే, ఆఫ్ఘనిస్థాన్‌కు అవకాశాలు ఉంటాయి. సెమీస్ మ్యాచ్‌లు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత జట్టు గ్రూప్-బీ రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది.
ఈ నేపథ్యంలో, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ చేరుతాయని చెప్పారు.
దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని, భారత జట్టు మెరుగైన ఫామ్‌లో ఉందని క్లార్క్ అభిప్రాయపడ్డారు. రోహిత్ శర్మ అటాకింగ్ గేమ్ టీమిండియాకు కీలకం అవుతుందని, ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ టాప్ స్కోరర్‌గా నిలవొచ్చని అంచనా వేశారు.
ఈ వాదన ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. మరి భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్ నిజంగా కనబడుతుందా? లేదా మిగిలిన జట్లు శక్తిని చూపిస్తాయా? అనేది ఆసక్తికరంగా మారింది.