మూవీడెస్క్: నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన తండేల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ చిత్రాన్ని యువ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా, గతంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ 2 పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ ఘన విజయం తర్వాత చందూకి పెద్ద స్కేల్‌లో సినిమా చేసే అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని వెల్లడించారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, కార్తికేయ 2 చూసి ఆకట్టుకున్నారట.
దీంతో, రామ్ చరణ్ లేదా సూర్యతో ఏదైనా గ్లోబల్ రేంజ్‌లో సినిమా చేయాలని ఆఫర్ ఇచ్చినట్టు తెలిపారు.
అయితే, అప్పటికే తను నాగచైతన్యతో తండేల్ ప్లాన్ చేస్తున్న కారణంగా, ఆ ప్రాజెక్ట్‌ను మొదట పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు.
ఇక ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ఉంటుందా? లేక వేరే హీరోతో చేస్తారా? అనేది చూడాలి.
ప్రస్తుతం తండేల్ ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.
మరి ఈ సినిమా తర్వాత చందూ మొండేటి 300 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.