సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా ఎదుగుతున్న చందూ ముండేటి ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సీరియస్‌గా ప్లానింగ్ చేస్తున్నాడు. కార్తికేయ 2 పాన్-ఇండియా హిట్ తర్వాత, ఇటీవల విడుదలైన తండేల్ కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దీంతో టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ నుండి కూడా చందూకు ఆసక్తికరమైన ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే హృతిక్ రోషన్, కార్తిక్ ఆర్యన్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలు చందూ చెప్పిన కథలను విన్నారని, వీరిలో ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని టాక్. మరోవైపు, తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై సూర్యతో ఓ సినిమాకు చందూ కమిట్ అయినట్లు సమాచారం. రామ్ పోతినేనితోనూ ఒక కథా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్న చందూ, టాలీవుడ్ ప్రాజెక్ట్‌కే ముందుగా స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే, బాలీవుడ్ స్టార్ ఒకరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇప్పటివరకు చేసిన సినిమాల్లో విభిన్నమైన కథలతో మెప్పించిన చందూ, తన తదుపరి సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి బాలీవుడ్ ఎంట్రీ ముందా లేక టాలీవుడ్లో మరో బిగ్ ప్రాజెక్ట్ ముందా అనేది వేచి చూడాలి.