మడకశిర: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల గ్రామానికి వెళ్లారు.
అక్కడ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో స్వయంగా పాల్గొన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తన చేతుల మీదుగా పెన్షన్ అందించారు. వారితో నెరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
అక్కడే ఉన్న సత్యసాయి జిల్లా కలెక్టర్ ను పిలిచి, సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.