ఏపీ: సీఎం చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణీలతో కలిసి శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వారిని స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర అన్నదాన సత్రంలో నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం అందించింది. దేవాన్ష్ బర్త్‌డే సందర్భంగా ప్రతి ఏడాది ఒకరోజు అన్నదానం ఖర్చును ఈ కుటుంబం భరిస్తోంది. ఇది వారి సేవా సంప్రదాయంగా మారింది.
చంద్రబాబు, లోకేశ్, దేవాన్ష్ కలిసి స్వయంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబసభ్యులు ఐదుగురు కలిసి భక్తులతోపాటు అన్నం ప్రసాదంగా స్వీకరించారు. భక్తులంతా వీరి వినయాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాలకుల సేవా మానసికతకు ఇది మంచి ఉదాహరణగా మారింది.