fbpx
Sunday, October 27, 2024
HomeAndhra Pradeshఅభివృద్ధి మార్గంలో చంద్రబాబు భవిష్యత్‌ వ్యూహాలు

అభివృద్ధి మార్గంలో చంద్రబాబు భవిష్యత్‌ వ్యూహాలు

chandrababu-future-plans-for-development

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రణాళికలతో పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు సాగుతున్నారు. వచ్చే మూడు నెలలలో చేపట్టే కార్యక్రమాలకు ఇప్పటినుండే మార్గదర్శకం రూపొందించారు.

పార్టీ ప‌రంగా, ప్ర‌తి నియోజకవర్గంలో మూడు పార్టీల కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించి కూటమి ఐక్యతను మరింత పెంపొందించేందుకు సన్నాహాలు చేశారు. మండలాల వారీగా ఎన్డీయే సమన్వయ కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ శ్రేణుల్లో సుదృడ ఐక్యత ఏర్పడేలా చేయాలనుకుంటున్నారు.

ప్రభుత్వ పరంగా, అమరావతి రైల్వే లైన్ ఆమోదం, రహదారి అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లోని 4,300 కోట్ల ప్రణాళికలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచారం జరపాలనున్నారు. అదేవిధంగా రాబోయే కార్యక్రమాలకు పునాదులను ఇప్పుడే వేయాలనేది చంద్రబాబు వ్యూహం.

భవిష్యత్ ప్రణాళికల్లో, రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు 6 కొత్త పాలసీలను ప్రకటించారు. “జాబ్ ఫస్ట్” విధానంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు పునాదులు వేస్తున్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్‌లో భాగమని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular