ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీయే నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, అశ్వినీ వైష్ణవ్‌లతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, నిధులపై చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల అమలు, ఆర్థిక సహాయంపై అశ్వినీ వైష్ణవ్‌తో విస్తృతంగా మాట్లాడారు.
అమిత్ షా, జేపీ నడ్డాతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశాలు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అంతకుముందు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా, ఢిల్లీలోని ఆయన సమాధి సదా అటల్ వద్ద చంద్రబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అటల్ బిహారీ వాజ్‌పేయి చూపించిన మార్గదర్శనాలు భారత రాజకీయాల్లో అమూల్యమని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.