తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబు తాజా ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో కీలక సమావేశం జరిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.
ముఖ్యంగా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నరేంద్ర మోడీ ఆసక్తి చూపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై మోడీ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, ఎన్ డీడీబీ నివేదికను ప్రధానికి అందజేశారు,
అందులో నెయ్యి కల్తీ జరిగినట్లు స్పష్టం చేసినట్లు వివరించారు. అలాగే, తిరుమల పవిత్రత, లడ్డూ ప్రాసాదం పంపిణీకి సంబంధించిన వివరాలను కూడా చంద్రబాబు వివరించినట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో కేటాయించిన 12 వేల కోట్లలో 6 వేల కోట్లను తక్షణం విడుదల చేయాలనీ, అలాగే వరద సాయం గురించి కూడా చర్చించారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, గడిచిన 100 రోజుల పాలనను ప్రధాని మోడీ ప్రశంసించినట్లు టీడీపీ ఎంపీలు తెలిపారు.