అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. నేతలకు ప్రజా దర్బార్ విధులు వేసి తద్వారా ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించడంపై దృష్టి పెట్టారు.
ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. మంత్రులు, ముఖ్య నాయకులు ప్రతి రోజు ఉదయం 7 గంటలకల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఆగస్టు నెలలో వివిధ తేదీలలో మంత్రులు, టీడీపీ నేతలు ప్రజా దర్బార్లో పాల్గొననున్నారు.
ఈ దర్బార్లలో ప్రజలు తమ సమస్యలను, వినతిపత్రాలను సమర్పించి తక్షణమే పరిష్కారాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
చంద్రబాబు తీసుకుంటున్న ఈ చర్యలు పాలనను ప్రజలకు చేరువ చేయడం, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించడంలో మేలుకొల్పుతాయని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.