ఏపీ: రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి ఆరు నెలలు పూర్తవగా, సీఎం చంద్రబాబు పాలనలో మరింత వేగం చూపేందుకు సిద్ధమవుతున్నారు.
జనవరి నుండి ప్రాజెక్టులు, పథకాల అమలులో దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించారు. సూపర్ సిక్స్‌లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి రాజధాని పనులు వేగవంతం చేయడంతో పాటు పోలవరం దిగువ కాఫర్ డ్యాం నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
డిజిటల్ పాలనను మరింత పటిష్టం చేసేందుకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు సౌలభ్యాన్ని కల్పించాలని నిర్ణయించారు.
రేషన్ బియ్యం స్థానంలో నగదు పంపిణీని ప్రాథమికంగా శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో అమలు చేయాలని చూస్తున్నారు.
పాలనపై సానుకూల ప్రతిస్పందన అందుకోవడానికి జనవరి నుండి కూటమి సర్కారు మరింత చురుకుగా ఉండనుంది. ముఖ్యంగా ప్రజా ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా చంద్రబాబు ముందడుగు వేస్తుండటం గమనార్హం.