ఏపీ: ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టాపన కోసం 10 ఎకరాల భూమి కేటాయించాలని చంద్రబాబు కోరారు.
ఈ విగ్రహంతో పాటు నాలెడ్జ్ సెంటర్ నిర్మాణ ప్రతిపాదన కూడా ఉంది. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ తరఫున ఈ విజ్ఞప్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో రేవంత్ రెడ్డికి అందించబడింది.
ఈ భూమి కేటాయింపు విషయంపై రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన రాలేదు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలో ప్రతిపక్షాల నుండి వ్యతిరేకత ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఇప్పటికే చంద్రబాబు తీసుకున్న శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిర్ణయం రెండు రాష్ట్రాల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించగా, ఈ కొత్త ప్రతిపాదనపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో ఆసక్తికరంగా మారింది.
రెండు రాష్ట్రాల మధ్య శాంతి, స్నేహసంబంధాలను పటిష్టం చేయడంలో ఈ నిర్ణయం కీలకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ విజ్ఞప్తిని ముందుకు తీసుకెళ్తే, అది రెండు రాష్ట్రాల మధ్య కొత్త ఒప్పందాలకు దారితీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.