ఏపీ: సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో సాంకేతికతను వినియోగిస్తూ మరో వినూత్న ప్రయోగం చేపట్టారు. భద్రతా సిబ్బందిపై ఆధారపడకుండా, స్వతంత్రంగా పనిచేసే అటానమస్ డ్రోన్లను భద్రతలో వినియోగించడం దేశంలోనే ఇదే తొలిసారి.
ఈ నిర్ణయంతో నెలకు సుమారు ₹12 కోట్ల ఖర్చు తగ్గుతుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ఈ డ్రోన్లు చంద్రబాబు నివాసంతో పాటు, పర్యటనల్లోని భద్రతను పర్యవేక్షిస్తాయి.
ఇవి ప్రతి రెండు గంటలకోసారి పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తూ, ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులను సెక్యూరిటీ అధికారులకు సూచిస్తాయి. ఆటోపైలట్ విధానంలో పనిచేసే ఈ డ్రోన్లు, తగినంత ఛార్జింగ్ తో నిరంతర సేవలు అందిస్తాయి.
ఈ డ్రోన్ల వినియోగం వల్ల భద్రతా సిబ్బందిని 600 నుంచి 230కి తగ్గించారు. కాన్వాయ్‌లోనూ వాహనాల సంఖ్యను 15 నుంచి 11కి తగ్గించారు.
ఈ ప్రక్రియ ద్వారా భద్రతతో పాటు ప్రభుత్వ ఖర్చులో పొదుపు జరుగుతోంది. భద్రతలో సాంకేతికతను వినియోగిస్తూ, రాష్ట్ర ప్రగతికి దోహదం చేసే చంద్రబాబు నిర్ణయం ప్రగతిశీల దిశగా మరో అడుగుగా నిలిచింది.