fbpx
Saturday, January 18, 2025
HomeMovie Newsఫిబ్రవరి లో 'చెక్' పెట్టనున్న నితిన్

ఫిబ్రవరి లో ‘చెక్’ పెట్టనున్న నితిన్

ChandraShekarYeletiAndNithin CheckMovie ReleaseDateAnnounced

టాలీవుడ్: కొత్తదనం తో సినిమాలు తీస్తాడని ‘చంద్ర శేఖర్ యేలేటి‘ కి ఇండస్ట్రీ లో మంచి పేరుంది. ఇప్పటి వరకు ఈయన తీసిన సినిమాలే అందుకు నిదర్శనం. ఒకసారి తీసిన జానర్ ని ఇంకోసారి టచ్ చేయకుండా ప్రతీసారి తానేంటో నిరూపించుకుంటారు. ఈ సారి నితిన్ తో కలిసి ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాని రూపొందించారు. ‘చెక్’ అనే టైటిల్ తో రూపొందిన ఈ సినిమాలో జైలు లో ఖైదీ గా నితిన్ నటిస్తున్నాడు. అద్భుతంగా చెస్ ఆడే అమాయకుడైన ఒక వ్యక్తి ఉరి శిక్ష పడిన ఒక ఖైదీలా ఎలా మారాడు, ఆ శిక్ష నుండి ఎలా తప్పించుకున్నాడు అనే థీమ్ తో ఈ సినిమా రూపొందిందని ఇదివరకే విడుదలైన టీజర్ ద్వారా తెలుస్తుంది.

ఈ సినిమాని ఫిబ్రవరి 19 న విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నితిన్ తో పాటు రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా ఫిబ్రవరిలో ‘భీష్మ’ విడుదల చేసి హిట్ కొట్టాడు నితిన్. ఈ సినిమానే కాకుండా నితిన్ , కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ సినిమా మార్చ్ 29 న విడుదలవుతుంది. ఒక నెల గ్యాప్ లో నితిన్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది నితిన్ నుండి నాలుగు సినిమాలు విడుదల అవబోతున్నట్టు తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular