టాలీవుడ్: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు వచ్చే కొన్ని చిన్న సినిమాలు టైటిల్, ఫస్ట్ లుక్ తో సహా ప్రతి ఎలిమెంట్ లో తెలుగు తనాన్ని చూపించేవిధంగా ఉంటాయి. బాపు గారి సినిమాలు, నాని అష్టా చెమ్మ లాంటి సినిమాలు అందుకు కొంత వరకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంచు మించు అలాంటి క్వాలిటీస్ తో ఒక సినిమా రానునన్నట్టు అనిపిస్తుంది. పెళ్లి చూపులు సినిమాలో అభయ్ గా నటించిన నవీన్ బేతిగంటి హీరోగా, ఈ మధ్య చిన్న చిన్న పాత్రలు వేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటి దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలుగా ‘చరిత కామాక్షి’ అనే సినిమా రూపొందుతుంది. ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది సినిమా టీం.
మంచి తెలుగు టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ లో మంచి తెలుగు దనం ఉట్టి పడే కాస్ట్యూమ్స్ ధరించిన హీరో , హీరోయిన్లని చూడవచ్చు. సినిమా బ్యాక్ డ్రాప్ పెళ్లి అయిన భార్య భర్తల మధ్య ఉండే ఘర్షణ, సంతోషం, బాధ లాంటి ఎలిమెంట్స్ ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా రూపొందినట్టు అర్ధం అవుతుంది. టైటిల్ లోగో లో ఒక తాళి ని చూపించి , ఏడు అడుగుల గుర్తులు పెట్టి సింబాలిక్ గా పెళ్లి మరియు పోస్టర్ లో భార్య భర్తల లుక్స్ ని బట్టి భార్యా భర్తల మధ్య ఉండే ఎమోషన్స్ ని చూపించబోతున్నట్టు అర్ధం అవుతుంది. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజిని రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. స్త్రీలంక చందు సాయి ఈ సినిమాని డైరెక్ట్ చేసారు. ఓవరాల్ గా ఫస్ట్ లుక్ తోనే ఇలాంటి సినిమాలని అభిమానించే ఒక వర్గం ప్రేక్షకులని ఈ సినిమా ఆకట్టుకుందని చెప్పవచ్చు.