2025లో బుక్ మై షో టికెట్ అమ్మకాల రికార్డులను చావా సినిమా తుడిచిపెట్టేస్తోంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా 4.90 మిలియన్ టిక్కెట్లు అమ్ముడవడంతో అగ్రస్థానంలో నిలిచింది. మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది.
ఇక రెండో స్థానంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 3.59 మిలియన్ టిక్కెట్లు అమ్ముకుని ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించింది. మూడో స్థానంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ 2.25 మిలియన్ టిక్కెట్స్ తో నిలిచింది.
తండేల్, స్కై ఫోర్స్, విడాముయార్చి, డాకూ మహారాజ్ సినిమాలు కూడా బుక్ మై షోలో మంచి బుకింగ్స్ సాధించాయి. నాగ చైతన్య తండేల్ 1.19 మిలియన్ టిక్కెట్లు అమ్ముకుని వేగంగా దూసుకెళ్తోంది.
మొత్తానికి చావా మూవీ 2025లో బుక్ మై షో రికార్డులను తిరగరాస్తూ, బాక్సాఫీస్ దగ్గర కూడా సునామీలా దూసుకెళ్తోంది.