చావా సినిమా ప్రేక్షకులపై తీవ్ర భావోద్వేగాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో, సినిమా చివరలో జై శంభాజీ నినాదాలతో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటూ థియేటర్లను వీడుతున్నారు. కొందరు శివాజీ వేషధారణలో థియేటర్లకు వస్తూ, మరికొందరు గుర్రాలపై స్వారీ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.
తాజాగా గుజరాత్‌లోని భరుచ్ ఆర్కే సినిమాస్‌లో ఒక్క సంఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. జయేష్ వాసవ అనే వ్యక్తి మద్యం సేవించి చావా సెకండ్ షోకి హాజరయ్యాడు. సినిమా క్లైమాక్స్‌లో శంభాజీ మహారాజ్‌పై ఔరంగజేబు చిత్రహింసల సన్నివేశం చూసి ఆగ్రహంతో స్క్రీన్‌పై దాడి చేశాడు.
అతను థియేటర్‌లో ఉన్న ఫైర్ ఎక్స్టింగిషర్‌తో స్క్రీన్‌ను పాడిచేసి, సుమారు రెండు లక్షల రూపాయల మేర నష్టం కలిగించాడు. ఈ ఘటనతో మరుసటి రోజు షోలు రద్దు చేయాల్సి వచ్చింది. పోలీసులు జయేష్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఈ సంఘటనతో చావా సినిమా జనాల్లో ఎంతగా ఎమోషనల్‌గా ఎక్కిందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ సినిమా టిక్కెట్లు పండుగల మాదిరిగా అమ్ముడవుతున్నాయి.