తెలుగు హీరోపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు నమోదు అయ్యింది!
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు శ్రీతేజ్ వివాదంలో చిక్కుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. గతంలో కూడా శ్రీతేజ్‌పై వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
ఫిర్యాదు నేపథ్యంలో దర్యాప్తు
తాజా కేసులో యువతి పెళ్లి ప్రస్తావన చేసి మోసపోయినట్టు ఫిర్యాదులో పేర్కొంది. శ్రీతేజ్ మాటలతో నమ్మించి అన్యాయానికి గురిచేశారని ఆమె ఆరోపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు మొదలు పెట్టారు.
శ్రీతేజ్ సినీ కెరీర్
2013లో విడుదలైన నా సామిరంగా చిత్రంతో సినీరంగంలో అడుగుపెట్టిన శ్రీతేజ్, తర్వాతి సినిమాల్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి చిత్రం ద్వారా పాపులారిటీ సంపాదించారు.
అలాగే, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషించి మెప్పించారు. లక్ష్మీ’స్ NTR చిత్రంలో నారా చంద్రబాబు నాయుడు పాత్రలో నటించి మరింత పాపులారిటీ పెరిగింది.
పుష్ప చిత్రాల్లో కీలక పాత్ర
శ్రీతేజ్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో కీలక పాత్ర పోషించారు. త్వరలో విడుదల కానున్న పుష్ప 2లోనూ నటించారని సమాచారం. ఈ కేసు ద్వారా ఆయన కెరీర్ ఎలా మలుపు తిరుగుందో వేచిచూడాలి.