దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 పున:ప్రారంభం తరువాత మొదటి గేమ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌ని 20 పరుగుల తేడాతో ఓడించింది. సీఎస్కే యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 88 పరుగులు జోడించడంతో ముంబై ముందు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించ గలిగింది. చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకోగా, కేవలం గైక్వాడ్ తప్ప ఇతర బ్యాట్స్ మెన్ అందరూ తమ ఆటను ప్రదర్శించడంలో విఫలమయ్యారు.
చేజింగ్ లో, కీరోన్ పొలార్డ్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం లభించినప్పటికీ ఛ్శ్ఖ్ పేసర్లు ఆటపై ఆధిపత్యం చెలాయించారు. ముంబై తరఫున 157 పరుగుల ఛేజింగ్‌లో ఏ ఇతర బ్యాట్స్‌మెన్ 20 కంటే ఎక్కువ పరుగులు చేయలేకపోయారు, కేవలం సౌరభ్ తివారీ మాత్రమే తన యాభై పరుగులతో ముంబై తరఫున అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున డ్వేన్ బ్రావో (3/25), దీపక్ చాహర్ (2/19) కీలక వికెట్లు తీశారు. ఈ విజయంతో, ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎనిమిది మ్యాచ్‌లలో ఆరు గెలిచి 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇప్పటికీ ఎనిమిది పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉంది.