దుబాయ్: ఐపీఎల్ 2020 ఎట్టకేలకు ప్రారంభమైంది. అభిమానులు కోలాహలం లేదు, చీర్ లీడర్స్ లేరు, ప్రారంభ అట్టహాసాలు, నృత్యాలు ఏవి లేకుందా తొలి సారి ఐపీఎల్ మాచ్లు మొదలయ్యాయి. తొలి మ్యాచ్ చెన్నై ముంబాయి మధ్య జరిగింది. చరిత్ర మారలేదు, తొలి మ్యాచ్లో ఓడి పోయే అలవాటు ఉన్న ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా చెన్నైతో ఓడిపోయింది. మ్యాచ్ వివరాలు:
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సౌరభ్ తివారి (31 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. క్వింటన్ డి కాక్ (20 బంతుల్లో 33; 5 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. చెన్నై బౌలర్లలో ఇన్‌గిడి 3 వికెట్లు పడగొట్టగా… దీపక్ చహర్, రవీంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి విజయం సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అంబటి తిరుపతి రాయుడు (48 బంతుల్లో 71; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫాఫ్ డు ప్లెసిస్ (44 బంతుల్లో 58 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 85 బంతుల్లో 115 పరుగులు జోడించారు.
ఢిల్లీ మరియు పంజాబ్ మ్యాచ్:
మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తడబడుతూ బ్యాటింగ్ కొనసాగించింది. ధావన్ డకౌట్ అయ్యాడు. తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. ఎలోగోలా తంటాలు పడి స్కోరు బోర్డ్ పై 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
తదుపరి బ్యాటింగ్ చేసిన పంజాబ్ మయాంక్ అగర్వాల్ మెరుపులతో ధాతిగా ఆడింది. అయితే చివరకు మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో సూపర్ ఓవర్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు సూపర్ ఓవర్ ద్వార 2 వికెట్ల తేడాతో ఢిల్లీ పంజాబ్ పై విజయ సాధించి ఐపీఎల్ లో బోణీ కొట్టింది.