దుబాయ్: ఐపీఎల్ 2021 లో తొలిగా ఫైనల్ చేరిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. మొదటి క్వాలిఫయర్ లో ఢిల్లీ పై ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కి చేరింది. ఢిల్లీ నిర్దేశించిన 173 పరుగుల లక్ష్య చేధనలో డుప్లిసిస్ వికెట్ త్వరగానే కోల్పోయిన్ చెన్నైకి రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ మంచి భాగస్వామ్యాన్ని రెండో వికెట్‌కి 110 పరుగులతో చెన్నై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
రాబిన్ ఊతప్ప కేవలం 44 బంతుల్లోనే 7 ఫోర్ల తో 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం 4 పరుగుల వ్యవధిలోనే ప్రయోగాలు చేయడం వల్ల వరుసగా మూడు వికెట్లను చేజార్చుకుంది. టామ్ కరన్ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్‌కు చేరగా, రబాడా బౌలింగ్‌లో అంబటి రాయుడు రనౌట్ అయి పెవిలియన్ చేరాడు.
చెన్నై ఓపనర్ రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. టామ్ కరన్ వేసిన అఖరి ఓవర్‌లో 13 పరుగుల కావల్సిన సమయంలో తొలి బంతికి మొయిన్ ఆలీ ఔట్ అవ్వగా, వరుసగా 3 ఫోర్లు బాది ధోని చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ధోని కేవలం 6 బంతుల్లో 3ఫోర్లు 1 సిక్స్‌తో 18 పరుగులు సాధించాడు.