ముంబై: ఏప్రిల్ 3వ తేదీ పంజాబ్ కింగ్స్ చేతిలో 54 పరుగుల తేడాతో ఓటమి పాలైంది చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోయి హ్యాట్రిక్ ఓటములతో పాటు మరో చెత్త రికార్డును కూడా చీఎస్కే నమోదు చేసింది.
ఐపీఎల్‌లో ఇంతవరకు చెన్నై పరుగుల పరంగా రెండవ అతి పెద్ద ఓటమిని నమోదు చేసింది. 2013లో ముంబై ఇండియన్స్ చేతిలో 60 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సీఎస్‌కే, మళ్ళీ 9 ఏళ్ల తర్వాత ఆ స్థాయి ఓటమిని మూటగట్టుకుంది.
నిన్న పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయిన చెన్నై 2018 ఐపీఎల్ సీజన్ తరువత ఇప్పుడే తొలిసారి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన పంజాబ్ కింగ్స్, డిఫెండింగ్ ఛాంపియన్‌కు షాకిచ్చి సీజన్‌లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది.