దుబాయ్: ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో పరాజయం ఎదురైంది. క్రితం మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఓటమి పాలైన హైదరాబాద్, తాజాగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ 20 పరుగుల తేడాతో ఓటమి చెందింది. సీఎస్‌కే నిర్దేశించిన 168 పరుగుల టార్గెట్ ఛేదనలో ఎస్‌ఆర్‌హెచ్ 8 వికెట్ల నష్టానికి 147 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దాంతో సన్‌రైజర్స్‌పై సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంది.
ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన ఫస్ట్ లెగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధించగా, ఆ లెక్కను చెన్నై సరిచేసింది. లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ ఆదిలోనే రెండు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. డేవిడ్ వార్నర్(9), మనీష్ పాండే(4) వికెట్లను
త్వరగా చేజార్చుకుంది.
ఆ తరుణంలో జోనీ బెయిర్ స్టో(23), కేన్ విలియమ్సన్(57)లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. కాగా, బెయిర్ స్టో మూడో వికెట్‌గా ఔటైన తర్వాత ఆరెంజ్ ఆర్మీ తడబాటుకు గురైంది. విలియమ్సన్ ఆడినా మిగతా వారి నుంచి సహకారం లభించలేదు. ప్రియాం గార్గ్(16), విజయ్ శంకర్(12)లు నిరాశపరచడంతో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటమి తప్పలేదు.
రషీద్ ఖాన్(14;8 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) ఆశలు రేకెత్తించినా హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ ఖాతాలో మరో పరాజయం చేరింది. ఇది సీఎస్‌కే మూడో విజయం కాగా, సన్‌రైజర్స్‌కు ఐదో ఓటమి. సీఎస్‌కే బౌలర్లలో కరాన్ శర్మ, బ్రేవోలు తలో రెండు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా, శార్దూల్, సామ్ కరాన్‌లకు తలో వికెట్ లభించింది.