దుబాయ్: చెన్నై మరోసారి అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలో 4వ సారి కప్పు గెలిచి ముంబై తో సమానంగా నిలిచింది. గత ఏడాది ఫైనల్ కు చేరకుండానే నిష్క్రమించిన ఈ సారి చాల బలంగా తిరిగొచ్చి ఏకంగా 4వ సారి కప్పును గెలుచుకుని తన సత్తా ఏంటో చాటింది.
ఉత్కంఠగా సాగుతున్న ఫైనల్ ఒక్క సారిగా చెన్నై వైపు తిరిగింది. దాంతో ఇక కోల్కత్తా ఏ దశలోనూ గెలుపు వైపు చూసే పరిస్థితి లేకుండా చేశారు చెన్నై బౌలర్లు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కేకేఆర్ స్కోరు బోర్డును కదలకుండా చూసుకున్నారు.
ఈ సీజన్ లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఒక సెంచరీ తో పాటూ 8 హాఫ్ సెంచరీలు సాధించిన రుతురాజ్ బెస్ట్ బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. చెన్నై మొత్తానికి తన జూలు విడిచి తమ సత్తా ఇంకా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది.
చెన్నై గెలుపుతో ఐపీఎల్ 2021 ప్రహసనం ముగిసింది. ఇక వచ్చే ఏడాది మెగా ఆక్షన్ ఉండనుంది. కాబట్టి ఈ సారి అన్ని జట్లలో భారీగానే మార్పుల్లు చోటు చేసుకోనున్నాయి.