ఇటీవల బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. అయితే విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చావా ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. మహారాష్ట్రలో ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి అంచనాలు ఉండగా, విడుదలైన తర్వాత అదే రేంజ్‌లో కలెక్షన్లు కూడా దూసుకుపోతున్నాయి.
చావా కథాంశం ఛత్రపతి శివాజీ కుమారుడు శంబాజి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కింది. సినిమా రిలీజైన వారం చివరికి 106 కోట్లు నెట్ వసూళ్లు సాధించి, బాలీవుడ్‌కు ఊపిరి పోసింది. ముఖ్యంగా ఆదివారం ఒక్కరోజే 44 కోట్లు రాబట్టి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముంబయి అర్బన్ బెల్ట్‌లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ రావడం కలెక్షన్లను పెంచింది.
ఈమధ్య కాలంలో బాలీవుడ్‌కి ఇంత భారీ ఓపెనింగ్ రాలేదు. మహారాష్ట్రలో అద్భుతంగా రన్ అవుతున్నా, ఉత్తర భారతదేశంలో మాత్రం కలెక్షన్లు కొంత మిశ్రమంగా ఉన్నాయి. అయితే, పాజిటివ్ టాక్ కారణంగా సినిమా స్టడీగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కూడా మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఇక ట్రేడ్ అనలిస్టుల అంచనా ప్రకారం, రెండో వీకెండ్ ముగిసే నాటికి చావా 150 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉంది. వారం మధ్యలో బుకింగ్స్ బాగుండటంతో, ఇది మరింత పెరిగే అవకాశముంది. ముఖ్యంగా సోమవారం తర్వాత కూడా స్టడీగా రన్ అవుతుండటంతో, లాంగ్ రన్‌లో ఇది బిగ్ హిట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మొత్తానికి, బాలీవుడ్‌లో మరోసారి హిస్టారికల్ మూవీ మాస్ అట్రాక్షన్‌ను పెంచింది. చావా విజయంతో పిరియాడికల్ సినిమాల ట్రెండ్ మరింత బలపడేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఎంత వరకు లాంగ్ రన్‌లో నిలుస్తుందనేది వేచి చూడాలి.