తెలుగు ప్రేక్షకులకు చారిత్రక కథానాయుకుల జీవితగాథలపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ఛావా ఇప్పుడు తెలుగులోనూ అదిరిపోయే ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, కథనంతోనే కాదు, విజువల్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తోనూ ఆకట్టుకుంటోంది. హిందీలోనే 600 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ మూవీ, తెలుగులోనూ మంచి కలెక్షన్లు రాబడుతోంది.
హిందీలో ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా, తెలుగు ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఆలస్యంగా రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ సినిమాను భారీ స్థాయిలో 500కి పైగా థియేటర్లలో విడుదల చేయడంతో, బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన వచ్చింది. మొదటి రోజే 2.9 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేయడం విశేషం. సాధారణంగా హిందీ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ ఇంత భారీ ఓపెనింగ్స్ రావడం అరుదు. కానీ ‘ఛావా’ మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉన్న కారణంగా ప్రేక్షకులు సినిమాకు మంచి ఆదరణ చూపిస్తున్నారు.
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం ప్రధాన బలంగా మారింది. తెలుగు వెర్షన్‌కి గీతా ఆర్ట్స్ క్వాలిటీ డబ్బింగ్ ఇవ్వడం, కథను మరింత నేటివిటీగా మార్చడం వల్ల ప్రేక్షకులు సినిమాను సహజంగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా యుద్ధ సన్నివేశాలు, శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ పోషించిన తీరు, ఎమోషనల్ డైలాగ్స్ సినిమాకు బలమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, వీకెండ్‌లో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ సరైన సమయంలో మంచి కథను తెలుగు ప్రేక్షకులకు అందించడంతో, టాలీవుడ్‌లో కూడా చారిత్రక చిత్రాలకు మంచి డిమాండ్ ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఛావా తెలుగులో ఎంతవరకు రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.