fbpx
Wednesday, March 26, 2025
HomeMovie Newsఛావా పార్లమెంట్ స్క్రీనింగ్.. మోదీ వీక్షణపై బజ్!

ఛావా పార్లమెంట్ స్క్రీనింగ్.. మోదీ వీక్షణపై బజ్!

chhava-parliament-screening-vicky-rashmika-modispecialshow

విక్కీ కౌశల్ – రష్మిక మందన్నా జంటగా వచ్చిన ఛావా చిత్రం బాలీవుడ్‌లో హిస్టారికల్ హిట్‌గా నిలిచింది. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ భావోద్వేగంతో తెరకెక్కించిన కథనానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.

ఇప్పుడు ఈ సినిమా మరో గొప్ప గౌరవాన్ని దక్కించుకునేలా ఉంది. ఈ మార్చ్ 27న సాయంత్రం 6 గంటలకు భారత పార్లమెంట్ ప్రాంగణంలో ఛావా స్పెషల్ స్క్రీనింగ్ జరగనుందని సమాచారం. దేశవ్యాప్తంగా ఎంపీలు ఈ ప్రదర్శనకు హాజరవుతారన్న వార్తలు ఇప్పటికే మీడియా వర్గాల్లో వైరల్‌గా మారాయి.

ఇంకా ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌లో పాల్గొననున్నారన్నది. ఇది జరిగితే, బాలీవుడ్‌లో ఇదొక అరుదైన గౌరవంగా నిలుస్తుందని భావిస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఛావా సినిమాకు వస్తున్న ఈ స్థాయి గౌరవం, శంభాజీ మహారాజ్ గురించి మరింత అవగాహన పెరిగేలా చేస్తోంది. మోదీ వాచ్ చేస్తే, ఇది సినిమాకు మాత్రమే కాదు… చరిత్రను సెలబ్రేట్ చేసే మూడ్‌కి మైలురాయిగా నిలవనుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular