బీజింగ్: చైనాలో తగ్గాయి అనుకున్న కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ పోతున్నాయి. డెల్టా వేరియెంట్ వల్ల కొత్త కేసుల వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడచిన వారం రోజులలో 11 ప్రావిన్స్‌లలో 100కి పైగా కొత్త డెల్టా కేసులు నమోదయ్యాయి. దాదాపు 40 లక్షల జనాభా కలిగిన లాన్‌జువో నగరంలో ఇప్పటికే అత్యవసర పరిస్థితుల్ని కూడా ప్రకటించారు.
ప్రజలెవరూ తమ ఇళ్లను వదిలి బయటకు రాకూడదని చైనా ప్రజలను కోరింది. కాగా చైనాలో ఈ పాటికే 75 శాతానికి పైగా ప్రజలకు రెండు డోసులు కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం పూర్తయింది. అయినప్పటికీ ఇలా కొత్త కేసులు పెరగడం ఆందోళన రేపుతోంది. జీరో కోవిడ్ లక్ష్యంతో ముందుకు వెళుతున్న చైనా, ఇలా కేసులు అమాంతంగా పెరిగడంతో ఉలిక్కిపడుతోంది.
ఏదైనా ప్రాంతంలో ఒకట్రెండు కేసులు కనిపించినా కూడా కఠినమైన ఆంక్షలను విధిస్తోంది. లాన్‌జువాలో కొత్తగా 6 కేసులు బయటపడగానే అప్రమత్తమై లాక్‌డౌన్ విధించింది. 24 గంటల్లో 29 కేసులు వెలుగులోకి వస్తే అందులో లాన్‌జువాలో 6 కేసులు నమోదయ్యాయి.