దెందులూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన వినూత్న ఆలోచనతో అందరి మనసులు గెలుచుకున్నారు. రాజకీయాల్లోనే కాకుండా సామాజిక కార్యక్రమాల్లోనూ చింతమనేని తనదైన ముద్ర వేస్తున్నారు.
తనకు వచ్చిన శాలువాలను వినియోగించి చిన్నారులకు బట్టలు కుట్టించి పంచడం ఆయన చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం.
తనను కలిసే నాయకులు, కార్యకర్తలు ఇచ్చిన శాలువాలను నిల్వచేసి వదిలేయకుండా, వాటిని వివిధ సైజుల గౌన్లు, డ్రెస్‌లుగా తయారు చేయించారు.
ప్రతివారం ఈ బట్టలను హాస్టళ్లు, అనాథాశ్రమాల్లోని విద్యార్థులకు స్వయంగా అందజేశారు. 6 నెలల్లో దాదాపు 250 మంది చిన్నారులకు బట్టలు కుట్టించగలిగామని చింతమనేని తెలిపారు.
రాజకీయ నాయకులందరూ ఈ పద్ధతిని అనుసరిస్తే ప్రజలకు మరింత సాయపడవచ్చని చింతమనేని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్నారుల భవిష్యత్తుకు సహకరించేందుకు చింతమనేని చేస్తున్న ప్రయత్నం నిజంగా ప్రేరణదాయకమని నెటిజన్లు అంటున్నారు.