మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ క్రేజీ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, తాజాగా మూవీ బడ్జెట్ చర్చనీయాంశంగా మారింది.
సినిమా నిర్మాణ ఖర్చు భారీగా పెరిగిందని, చిరంజీవి రూ.75 కోట్లు, అనిల్ రావిపూడి రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని టాక్. అలాగే, మరో ముఖ్యమైన పాత్ర కోసం ప్రముఖ నటుడితో సంప్రదింపులు జరుపుతున్నారట. ఆ నటుడి కోసం రూ.10 కోట్లు ఖర్చవుతుందని ప్రచారం సాగుతోంది.
మొత్తంగా ఈ సినిమా రూ.200 కోట్ల పైగా బడ్జెట్‌తో తెరకెక్కనున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ పెట్టుబడిని రికవర్ చేసుకోవడం ఎంతవరకు సాధ్యమన్నదే ప్రశ్నగా మారింది.
తక్కువ బడ్జెట్‌లో మెస్మరైజ్ చేసే కథలు నేటి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ డీల్స్ కూడా మారిపోతుండటంతో, వసూళ్లు ఎలా ఉంటాయన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే చిరంజీవి మార్కెట్, అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు కలిసి ఈ ప్రాజెక్ట్‌ను కాస్త ముందుకు తీసుకెళ్లవచ్చని అంటున్నారు. సంక్రాంతి రేసులో నిలబడితే మంచి వసూళ్లు సాధించే అవకాశముందనేది ట్రేడ్ వర్గాల అంచనా. కానీ ఈ భారీ బడ్జెట్‌ను రికవర్ చేసుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందనేది చర్చనీయాంశంగా మారింది.