ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్‌ని మెగాస్టార్ చిరంజీవి దుబాయిలో ప్రత్యక్షంగా వీక్షించారు. ఆదివారం దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను ఆయన సాధారణ వీక్షకుడిలా ఆసక్తిగా చూడడం విశేషం.
సాధారణంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కనిపించే చిరు, ఈసారి ఒంటరిగా స్టేడియంలో కనిపించారు. బ్లాక్ డ్రెస్, క్యాప్ ధరించి పాప్‌కార్న్ తింటూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. స్టేడియంలో రెండు సార్లు కెమెరా ఫోకస్ అవగా, చుట్టూ ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఆయనను గుర్తించి చేతులు కలిపారు.
అయితే చిరు దుబాయిలో ఒంటరిగా ఏమి చేస్తున్నారు అనే అనుమానాలు రావడం సహజం. రెండు రోజుల క్రితం ఆయన వివాహ వార్షికోత్సవం సందర్భంగా, దుబాయికి వెళ్తున్నానని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఆ సందర్భంగా దుబాయ్ వెళ్లిన చిరు, పనిలోపని ఈ క్రికెట్ మ్యాచ్‌ను కూడా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు చిరంజీవి దుబాయ్ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.