బ్రిటన్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి బ్రిటన్ పార్లమెంటులో ఘన సన్మానం జరగనుంది. నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా బ్రిటన్ అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా మార్చి 19న చిరంజీవిని గౌరవించనున్నారు.
ఈ వేడుకకు పలువురు బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను చిరంజీవికి ప్రదానం చేయనుంది.
ప్రజాసేవ, సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందజేయనున్నట్లు ప్రకటించారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ యూకేలో ప్రముఖ సంస్థగా, వివిధ రంగాల్లో విశిష్టమైన సేవలందించిన వ్యక్తులను గౌరవించడం ఇందుకు కారణమైంది.
ఇటీవలే చిరంజీవి భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. గత ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డ్, ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఇలాంటి అంతర్జాతీయ గుర్తింపులు ఆయన ఖ్యాతిని మరింత పెంచనున్నాయి.