మూవీడెస్క్, హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ రీమేక్ ‘గాడ్‌ఫాదర్’ చిత్రం షూటింగ్‌లో చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున ఆచార్య మూవీ యొక్క షూటింగ్ ఇటీవలే పూర్తి అవడంతో ఇప్పుడు ఆయన గాడ్‌ఫాదర్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించారు.
ఇంకో వైపు మెగాస్టార్ తనయుడూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ మూవీ షూటింగ్ కూడా పూర్తవడంతో దర్శకుడు శంకర్‌తో పాన్ ఇండియా మూవీని మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి, రాంచరణ్ లు తిరిగి ఆచార్య మువీ షూటింగ్‌లో త్వరలో పాల్గొననున్నట్లు సమాచారం.
తండ్రి తనయులు చిరు గాడ్‌ఫాదర్, చరణ్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల చిత్రీకరణలో బిజీగా గడపడంతో ఆచార్య సినిమాలోని రెండు పాటల చిత్రీకరణను దర్శకుడు కొరటాల కొన్ని రోజులు వాయిదా వేశారని సినీ వర్గాల్లో వినికిడి. ఇప్పుడు ఇద్దరూ కాస్త ఫ్రీ అవడంతో ఈ పాటలను తిరిగి చిత్రీకించడం కోసం ఆయన ప్లాన్ చేస్తున్నారని, ఇందుకోసం హైదారాబాద్ శివార్లలో ప్రత్యేకంగా సెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ సెట్‌లో చిరు, చరణ్‌లపై ఓ సాంగ్ షూటింగ్‌ను నిర్వహించబోతున్నాడట. ఇంకో పాట షూటింగ్ లో రాంచరణ్-పూజా హెగ్డేలపై ఉంటుందని, వచ్చే వారం ఈ పాట షూటింగ్‌ను జరపనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ నెల ఆఖరులోపు ఈ రెండు పాటల చిత్రీకరణ పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.