మూవీడెస్క్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరో వినూత్న ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో బిజీగా ఉన్న చిరు, తన తరువాత ప్రాజెక్ట్ కోసం ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
శ్రీకాంత్ ఓదెల తన తొలి చిత్రంతోనే పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుడు. అలాంటి దర్శకుడి కథను చిరంజీవి ఒక్క సిట్టింగ్‌లోనే ఆమోదించడం విశేషం.
ఈ సినిమా చిరు కెరీర్‌లోనే అత్యంత ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా ఉండబోతోందని చెబుతున్నారు.
మెగాస్టార్ ఈ చిత్రంలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు.
ఇప్పటివరకు చిరంజీవి చేసిన పాత్రలకు భిన్నంగా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఈ పాత్ర ఉండనుందని సమాచారం.
ఇక క్యారెక్టర్ల వైవిధ్యానికి శ్రీకాంత్ ఓదెల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.
‘భగవంత్ కేసరి’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ చెరుకూరి, ఈ ప్రాజెక్ట్‌కి మరింత ప్రాధాన్యతనిచ్చి నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా తగ్గట్లేదని టాక్.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. మెగాస్టార్ అభిమానులు ఈ కొత్త కాంబోపై చాలా ఆశలు పెట్టుకున్నారు.