టాలీవుడ్: సైరా నరసింహ రెడ్డి సినిమా తర్వాత కొరటాల శివ తో కలిసి ‘ఆచార్య’ సినిమా మొదలు పెట్టాడు మెగా స్టార్ చిరంజీవి. మధ్యలో వచ్చిన కరోనా గ్యాప్ లో వరుసగా సినిమాలు సెట్ చేసుకుని ప్రస్తుతం మూడు సినిమాలని లైన్ లో ఉంచాడు. అందులో మొదటగా ‘లూసిఫర్’ రీమేక్ గా రూపొందుతున్న గాడ్ ఫాదర్ సిద్ధం అవనుంది. ఈ రోజు చిరు పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా టైటిల్ ప్రకటించారు. తమిళ్ లో అజిత్ హీరో గా రూపొందిన వేదాళం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా టైటిల్ ప్రకటించారు.
‘భోళా శంకర్’ అనే టైటిల్ ని ఈ రోజు ప్రకటించారు. బ్యాక్ డ్రాప్ లో కల కత్తా చూపించారు. చూడాలని ఉంది తర్వాత చిరంజీవి మరో సారి కల కత్తా బ్యాక్ డ్రాప్ లో సినిమాలో నటిస్తున్నాడు. ఈ రోజు రాఖీ పౌర్ణమి కూడా అవడం తో ఈ సినిమా నుండి ఒక వీడియో కూడా విడుదల చేసారు. తమిళ్ లో అజిత్ చెల్లి పాత్రలో లక్ష్మి మీనన్ నటించారు. ఈ సినిమాలో ఆ పాత్ర మహానటి కీర్తి సురేష్ నటించారు. కీర్తి సురేష్ మెగా స్టార్ చిరు కి రాఖీ కట్టిన వీడియో ఒకటి విడుదల చేసి కీర్తి సురేష్ అందరి అన్నయ్య అలాగే అందరి అభిమాన హీరో చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అని తెలియచేసారు.
భోళా శంకర్ సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత మెహర్ రమేష్ మరో సారి మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. జూనియర్ ఎన్ఠీఆర్ తో కంత్రి, శాక్తి లాంటి ప్లాప్ లు అందించిన మెహర్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత డైరెక్షన్ చేయనున్నాడు. AK ఎంటర్టైన్మెంట్స్ మరియు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై ఈ సినిమా నిర్మాణమవుతుంది. 2022 లో ఈ సినిమా పూర్తి అవనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం నటిస్తున్న లూసిఫర్ సినిమా పూర్తి చేసి ఈ సినిమా మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.