టాలీవుడ్: సినిమా అంనౌన్సమెంట్స్ అందులో పెద్ద హీరోలు లేదా హీరో, డైరెక్టర్ కాంబినేషన్లు లాంటి అంనౌన్సమెంట్స్ ఎదో ఒక సందర్భాన్ని చూసుకొని ప్రకటిస్తారు, కానీ ఈ మధ్య అనుకోకుండా సోషల్ మీడియాలో పెట్టే మెసేజ్ ల వల్ల, లేదా స్టేజి పైన మాట్లాడేప్పుడు నోరు జారడం వల్ల అనుకోకుండా అనధికారికంగా ప్రకటన జరుగుతుంది. జనాలు చాలా ఫాస్ట్ గా ఉండడం వలన, ముందు నుండి అలంటి వార్తల పైన రూమర్స్ ఉండడం వలన జనాలు ఇట్టే పసిగట్టేస్తున్నారు.
పూరి జగన్నాథ్ పుట్టిన రోజు సందర్భంగా అందరూ విషెస్ తెలిపారు. అందులో డైరెక్టర్ బాబీ కూడా ఉన్నాడు. పూరి జగన్నాథ్ విషెస్ చెప్పిన వాళ్లందరికీ రిప్లై లు పెడుతూ బాబీ కి కూడా రిప్లై పెట్టాడు. పనిలో పనిగా బాస్ తో చేసే సినిమా కుమ్మేయ్ అన్నట్టు కూడా మెసేజ్ పెట్టారు. ఇప్పటికే ‘లూసిఫెర్’ సినిమా బాబీ దర్శకత్వం లో మెగాస్టార్ చిరు చేయబోతున్నాడు అని రూమర్స్ ఉండగా పూరి స్టేట్మెంట్ తో అది కాస్త పక్కా వార్త అయిపోయింది. ఇదివరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా ఇలాంటి ఒక రిప్లై తో మెహర్ రమేష్, చిరు కాంబినేషన్ సినిమా వార్త నిజం అని తేలింది, ఇపుడు ఈ వార్త. అంతకముందు చిరు ఒక సినిమా ప్రొమోషన్ కార్యక్రమం లో తాను చేయబోయే సినిమా పేరు ‘ఆచార్య’ అని ముందే ప్రకటించారు. ఇలా మామూలుగానే వచ్చే లీకులు కాకుండా పెద్ద వాల్ల నుండే వచ్చే లీకుల వలన ప్రొడ్యూసర్స్ సినిమాపైన హైప్ పెంచడానికి ఉండే ఒకటి రెండు అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి అని వాపోతున్నారు.