టాలీవుడ్: కరోనా ఫస్ట్ వేవ్ సమయం లో కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ) తో ఒక చారిటీ ని స్థాపించి ఫండ్స్ కలెక్ట్ చేసి ఎంతో మంచి చిన్న సినీ కార్మికులకు అండగా నిలిచాడు మెగా స్టార్. తనతో పాటు తోటి నటులను కూడా ఎంకరేజ్ చేసి ఇందులో భాగం చేసారు. ప్రస్తుతం సెకండ్ వేవ్ సమయంలో కూడా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ ప్రారంభించి ఇండస్ట్రీ మనుగడకు ముందడుగు వేస్తున్నాడు. ఈ మధ్యన 45 ఏళ్ళు పై బడిన వారికోసం మొదటి డ్రైవ్ నిర్వహించారు.
ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్, అపోలో హాస్పిటల్స్, కరోనా క్రైసిస్ ఛారిటీ ఆద్వర్యం లో 18 ఏళ్ళు పై బడిన సినీ కార్మికులకు, సినీ జర్నలిస్ట్ లకి వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. సినిమా 24 క్రాఫ్ట్స్ వర్కర్స్ , ఫిలిం ఫెడరేషన్ , మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, జర్నలిస్ట్ లకి ఈ డ్రైవ్ ద్వారా వాక్సిన్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ లేనిదే సినిమా షూటింగ్ లకి రాకూడదు అని రూల్స్ పెట్టుతుండడం తో సినీ కార్మికులకు ఇది ఎంతగానో ఉపయోగకరంగానూ అలాగే త్వరగా షూటింగ్ పనులు మొదలుపెడితే ఇండస్ట్రీ మళ్ళీ కల కల లాడుతుందని ఒక ఆశ కూడా మొదలయింది.